జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల తాలూకా పత్రికా ప్రకటన జనసేన విడుదల చేసింది. దాని సారాంశం ఏంటంటే, జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని, మరోసారి అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులు కూడా లాక్కుంటారని అన్నారు. జనసేన + టీడీపీ కలిసి పనిచేస్తేనే వైస్సార్సీపీ పాలనని అంతమొదించగలం అని ప్రకటించారు.
అదే వార్తని సాక్షి పత్రిక ఈ విధంగా ప్రచురించింది.
దీని సారాంశం ఏంటంటే, టీడీపీ + జనసేన పొత్తులో, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని, టీడీపీ కార్యకర్తలు అంతా జనసేన కిందే పనిచేయాలి అని నాగబాబు చెప్పినట్టు ప్రచురించారు. అంతేకాకుండా ఆ కార్యక్రమం అంతా రసాబాసగా జరిగిందట.
అసలు జరిగింది ఏమిటి? పత్రిక ప్రచురించింది ఏమిటి ? సాక్షి పత్రికకి బాగా ఆదరణ ఉంది కాబట్టి, మేము రాసిందే నిజం అనుకుంటారు అనే భ్రమలో ఉన్నారు. వార్తల్ని ప్రచురించకుండా, పార్టీల ఎజెండాని ప్రజల మీద రుద్దడం ఎంత వరకు సమంజసం ? ఈ రోజుల్లో మనం ఏ పత్రిక, ఏ పార్టీ చెప్పింది పూర్తిగా నమ్మకూడదు. ఏ విషయం అయినా, అన్ని పార్టీల అధికారిక ప్రచురణలో ఏమి చెప్తున్నారో కూడా చూడాలి. మన ఆలోచనల్ని అదుపులో ఉంచడానికి పార్టీలు ఎప్పుడూ ప్రయతిస్తూనే ఉంటాయి. మీకు ఒకరి అదుపులో ఉండడం ఇష్టమో, కాదో మీరే ఆలోచించుకోండి!!!
ఈ వార్త క్రింది మూలాధారాల ఆధారంగా ప్రచురించాము: