24 December, 2024

జగన్ కి ఏమి చూసుకుని ఈ ధైర్యం ?

AP Politics Political news

జగన్ కి ఏమి చూసుకుని ఈ ధైర్యం ?

సెప్టెంబర్ 9వ తారీఖుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మర్చిపోరేమో! తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడుని కస్టడీలోకి తీసుకున్న రోజు. సుమారు రెండు వారాలు కావస్తున్నా, ఇప్పటికీ బెయిల్ రాలేదు. ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు చాలదు అన్నట్టు కొత్తగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు కూడా పెట్టారు.

పరిస్థితి చూస్తుంటే, ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అయినా రిమాండ్లోనే ఉంచేలా ఉన్నారు. పైగా లోకేష్ ని కూడా రిమాండ్ లో పెడతారు అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలా అరెస్టులు చేస్తూ ఉంటే, టీడీపీకి లేని సానుభూతి రాదా ? అసలు జగన్ కి ఇంత ధైర్యం ఏంటి ?

గత 7-8 నెలలుగా లోకేష్ పాదయాత్ర పేరుతో ప్రజల్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ 3-4 నెలలుగా వారాహి యాత్రలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చాలా సార్లు ప్రకటించారు.
ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రజల్లో బాగా పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని రిమాండ్ కి పంపించడం వెనుక ఉద్దేశం ఏమైఉంటుంది ?

రాజకీయాల్లో మన ఓటుబ్యాంక్ ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయం జగన్ కి చాలా బాగా తెలుసు. తనని జైల్లో పెట్టడానికి కారణమైన నాయకుడిని, తన మీద లక్ష కోట్లు అవినీతి మారక రావడానికి కారణం అయిన పార్టీని ఇబ్బంది పెట్టడం అంటే, వైస్సార్సీపీ కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావడమే.

ఇక్కడ జగన్ ప్రభుత్వం అదే చేస్తోంది, ఇంకా చెప్పాలంటే చాలా పగడ్బంధీగా రిమాండ్లోకి తీసుకుని, బయటకు రావడానికి అన్ని అడ్డంకులను ఒకదాని తర్వాత ఒకటి సృష్టిస్తుంది. ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న వైస్సార్సీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. జగన్ ఒక దమ్మున్న నాయకుడు!, అని వైస్సార్సీపీ కార్యకర్తలు అనుకునేలా చేసాడు. 2014లో, 2019లో తనతోపాటుగా ఉన్న ఓటుబ్యాంక్ ని మరలా తనతోనే ఉండేలాగా చూసుకుంటున్నాడు.

Back To Top